- 11వ రోజుకు చేరిన మండల్ దివస్
- పాల్గొన్న బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డి. రాజారాం యాదవ్, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : బీసీ జన సభ రాష్ట్ర అధ్యక్షుడు డి. రాజారామ్ యాదవ్ ఆధ్వర్యంలో 11వ రోజు మండల్ దివస్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మండల దివస్ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు 42% కల్పించే విధంగా పోరాడాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ బీసీల ఐక్యత ఒక్కటే బీసీలకు రాజ్యాధికారం తెచ్చిపెడుతుందని అన్నారు.
బీసీలు సంఘటితమై బిపి మండల్ సిఫార్సులను అమలు చేసే విధంగా ముందుకు సాగాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మండల సిఫార్సులను తప్పకుండా అమలు చేయాలని కులగణన చేపట్టాలని దామాషా పద్ధతిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు కేటాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, ఉమ్మడి మెదక్ జిల్లా గొర్రెల మేకల పెంపకం దారుల మాజీ చైర్మన్ పోచబోయిన శ్రీహరి యాదవ్, మేదరి సంఘం కార్యదర్శి వెంకట్, కృష్ణ గౌడ్, వడ్డెర సంఘం కిరణ్, యాదవ్ సంగం రాకేష్, మున్నూరు కాపు సంఘం రాజు, బెస్త సంఘం సుభాష్, రజక సంఘం గోపి, అశోక్ పద్మశాలి, వివిధ సంఘాల నాయకులు, కార్యదర్శులు పాల్గొన్నారు.