గోపన్ పల్లి లో పెండింగ్ సమస్యలు పరిష్కరించండి

  • డిప్యూటీ కమిషనర్ కు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి వినతి

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధి గోపన్ పల్లిలోని మంజీర డైమండ్ హైట్స్ నెలకొన్న సమస్యలు, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై డిప్యూటీ కమీషనర్ రజినీకాంత్ రెడ్డి, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మంజీర డైమండ్ హైట్స్ లో చేపట్టవలిసిన సీసీ రోడ్లు, డ్రైనేజి పైప్ లైన్, వాటర్ పైప్ లైన్ల ఏర్పాటు కు కావాల్సిన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను అదేశించారు. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలన్నారు.

తమ కాలనీలో వర్షాలు కురిసినప్పుడు చెరువు నిండి చెరువు కట్ట నుంచి నీరు పెద్ద ఎత్తున బయటకు వస్తోందని, రోడ్లన్నీ జలమయం అయి జనం రాక పోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందిగా ఉందని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. రోడ్డుపై నీటి నిల్వ ఉండకుండా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్ రజినీకాంత్ రెడ్డి ని కోరారు. దీంతో అక్కడే ఉన్న అధికారులకు ఆయా సమస్యల పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

డిప్యూటీ కమిషనర్ కు వినతి పత్రం అందజేస్తున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

అనంతరం తమ కాలనీలో ఉన్న పార్క్ స్థలంలో ఓపెన్ జిమ్, చిల్డ్రెన్స్ పార్క్, క్రీడా ప్రాంగణం, విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, రంగారెడ్డి జిల్లా అర్బన్ కార్యదర్శిగా వరలక్ష్మి ధీరజ్, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షులు తిరుపతి మంజీరా డైమండ్ టవర్స్ ప్రెసిడెంట్ ప్రసాద్, మంజీర డైమండ్ హైట్స్ కాలనీ వాసులు. రేవతి, పద్మ, ఉదయలక్ష్మి, సత్యనారాయణ, బెనర్జీ, రెడ్డి, శ్రవణ్, సూర్య నారాయణ, రాజు, ప్రసాద్, ఆశు కక్కర్, సెల్విన్, శ్యామ్ ప్రధాన, అశోక్, సుమంత్, సీనియర్ నాయకులు, నర్సింగ్ నాయక్, శేఖర్, రంగస్వామి, జిహెచ్ఎంసి అధికారులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here