- కొండాపూర్ పార్టీ కార్యాలయంలో ఘనంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ జన్మదిన వేడుక
- పెద్ద ఎత్తున పాల్గొన్న సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, యువ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు
నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధి శ్రీరామ్ నగర్ కాలనీలోని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో కార్పొరేటర్ హామీద్ పటేల్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ వేడుకలలో సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, యువ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని హమీద్ పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కార్పొరేటర్ హమీద్ పటేల్ కృతజ్ఞతలు తెలిపారు.