నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలు, మౌలిక సదుపాయాలు, డివిజన్ పరిధిలో అసంపూర్తిగా చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి అన్నారు.
జిహెచ్ఎంసి 9వ సర్వసభ్య సమావేశంలో పాల్గొని అధికారులను కోరారు. ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు. బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మేయర్, డిప్యూటీ మేయర్లను వెంటనే రాజీనామా చేసి వారిపై అవిశ్వాస తీర్మానం చేయాలని నిరసించారు. 9వ సర్వసభ్య సమావేశంలో ఫ్ల కార్డులతో నిరసన తెలిపారు.