- ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వనం సుధాకర్
నమస్తే శేరిలింగంపల్లి : ఏఐఎఫ్ డివై ఆధ్వర్యంలో ఎంఏ నగర్ లో భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ల 93వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంసిపిఐ(యు) చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి, ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, ఏఐఎఫ్ డివై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనం సుధాకర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
నాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడి దేశ స్వాతంత్రం కోసం, సమానత్వం కోసం అతిపెన్న వయసులో ప్రాణాలర్పించిన భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ల ఆశయ స్ఫూర్తితో నేడు మతోన్మాదం, ఫాసిజం విధానాలతో పాలిస్తున్న బిజెపి పాలననుండి దేశాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు. దేశం కోసం ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న స్వాతంత్ర ఫలాలను ఆ తర్వాత రూపొందించుకున్న రాజ్యాంగాన్ని నేటి బిజెపి మనువాద పాలన చరిత్ర లేకుండా చేస్తుందని అన్నారు.
ఏఐఎఫ్ డి వై గ్రేటర్ హైదరాబాద్ కన్వీనింగ్ కమిటీ సభ్యులు డ. శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంసిపిఐయు గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్, ఏఐఎఫ్ డి వై గ్రేటర్ హైదరాబాద్ యువతుల కన్వీనర్ ఎండి సుల్తానాలు కూడా మాట్లాడారు. కార్యక్రమంలో తాండ్ర కళావతి, కుంభం సుకన్య, పి భాగ్యమ్మ, కర్ర దానయ్య, జి లావణ్య, దాసరి కీర్తి, జి శివాని, కొడిపాక రాజు, చందర్, ఎమ్ వై కుమార్, డి శిరీష, రాములు, జగదీష్ పాల్గొన్నారు.