- “గాంధీ శిల్ప బజార్ నేషనల్ మేళ” ప్రారంభించిన మంత్రి
నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ మాదాపూర్ లో అగ్రికల్చర్, మార్కెటింగ్ , కో -ఆపరేషన్, అండ్ హ్యాండ్లూమ్స్ & టెక్స్టైల్స్ తుమ్మల నాగేశ్వర రావు “గాంధీ శిల్ప బజార్ నేషనల్ మేళ” ను ప్రారంభించారు. హస్తకళా ఉత్పత్తుల స్టాల్ల్స్ సందర్శించారు. చేనేత హస్తకళాకారులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు.

డెవలప్మెంట్ అఫ్ కమీషనర్ హ్యాండీక్రాఫ్ట్స్ ఏర్పాటు చేసిన వివిధ రాష్ట్రాలనుండి హస్తకళా ఉత్పత్తులతో హస్తకళా కారులు శిల్పారామం ఆవరణలో సందర్శకులకు అందుబాటులో ఉన్నదని చెప్పారు. ఫోక్ పెయింటింగ్, బస్తర్ ఐరన్ క్రాఫ్ట్, జారీ జర్దోసి, జ్యువలరీ, హ్యాండ్ ప్రింటెడ్ డ్రెస్ మెటీరియల్స్, చీరలు, టెర్రకోట, లేస్ వర్క్, టై & డై , బిద్రీ క్రాఫ్ట్, సీతల్ పట్టి , బాంబూ, సిల్వర్ ఫిలిగ్రి , బొమ్మలు, డ్రై ఫ్లవర్స్ మరెన్నో హస్తకళా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.

సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా పావని శ్రీలత శిష్యబృందం కూచిపూడి నృత్య ప్రదర్శన, బీరప్ప బృందం ఒగ్గుడోలు ప్రదర్శన ఆధ్యంతం అలరించింది.
