- తెలంగాణ సగర సంఘం కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే
నమస్తే శేరిలింగంపల్లి : పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాలకు అన్ని వర్గాలకు ప్రాధాన్యతను కల్పిస్తూ ఆత్మగౌరవంతో బతికేలా సంక్షేమ ఫలాలను అందిస్తుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ తెలిపారు. కొండాపూర్ డివిజన్ పరిధి అంజయ్య నగర్ లోని సగర (భగీరథ సగర ) సంఘం కమ్యూనిటీ హాల్ లో 3వ అంతస్తును రూ. 3 కోట్ల 2లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను, సగరకార్యలయాన్ని ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. అన్ని వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పుడే ఆర్థిక సమానత్వంతో పాటు సమాజంలో సామాజిక సమానత్వం సాధ్యమవుతుందని అన్నారు.
ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో అన్ని కులాలకు నియోజకవర్గంలో తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలతో సామాజిక కోణంలో సహాయ సహకారాలు అన్ని వర్గాలకు అందిస్తామని హామీ ఇచ్చారు. పనిచేసే ప్రభుత్వాలను భవిష్యత్తులో ఆదరించాల్సిన బాధ్యత ప్రజలకు ఉంటుందని తెలిపారు. అంజయ్య నగర్ లోని సగర సంఘం ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు సగర సంఘం భవనం నిర్మించడం జరిగినదని, నేటితో అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. సగర సంఘం భవనం 3వ అంతస్తు నిధులు కేటాయించి సహకరించిన ఎమ్మెల్యే గాంధీకి సగర సంఘం సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర మాట్లాడుతూ అనాదిగా సమాజంలో అణగారిన వర్గాలుగా ఉన్న స్వల్ప సంఖ్యాకుల కులాలకు ప్రాధాన్యతనిస్తున్న మొదటి ప్రభుత్వం కేసీఆర్ దేనని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో సగర జాతికి తగిన ప్రాధాన్యత ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుందని తెలిపారు. కోకాపేటలో ఆత్మగౌరవ భావనం కోసం 2 ఎకరాల భూమి, రూ. 2 కోట్ల నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర సగర సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తమ జాతి ప్రయోజనాల కోసం పాటుపడే ప్రభుత్వాలకు, పాలకులకు తాము ఎల్లప్పుడూ వెన్నంటూ ఉంటామని తెలిపారు. రాబోయే సాధారణ ఎన్నికలలో అధికార పార్టీ చేసిన అభివృద్ధి సహకారాన్ని దృష్టిలో పెట్టుకొని మరోసారి కెసిఆర్ ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రవిముదిరాజు, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, అంజయ్య నగర్ సగర సంఘం అధ్యక్షులు నరసింహసాగర్, శ్రీ భగీరథ సగర భగీరథ ఆత్మగౌరవ భావన వెల్ఫే ట్రస్ట్ చైర్మన్ ఆస్కానీ మారుతి సాగర్, తెలంగాణ సగర సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు ముత్యాల హరి కిషన్ సగర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు పెద్దబుద్దుల సతీష్ సగర, రాష్ట్ర మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి గాండ్ల స్రవంతి సగర, గ్రేటర్ హైదరాబాద్ సగర సంఘం అధ్యక్షుడు మోడల రవి సగర, జాతీయ నాయకులు వెంకటరావు సగర, ఉదయ సగర, మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజ్, గ్రేటర్ గౌరవాధ్యక్షులు వెంకట్ స్వామి సగర, ప్రధాన కార్యదర్శి వెంకట రాములు సగర, కోశాధికారి రామస్వామి సగర, రాష్ట్ర సగర సంఘం నాయకులు, వివిధ జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, హైదరాబాద్ పరిధిలోని వివిధ ప్రాంతీయ సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు