నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ నవోదయ కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఆ కాలనీలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ పాదయాత్ర నిర్వహించారు. నేడు మనం చేసే పనులు రాబోయే తరాలకు మేలు జరిగేలా ఉండాలని, తన దృష్టికి వచ్చే ప్రతి అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ప్రజలకు మంచి జరిగేలా చూస్తానని తెలిపారు.
గెలుపోటములకు అతీతంగా ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి తనవంతు ప్రయత్నం ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మనేపల్లి సాంబశివరావు, సురేష్, భారత్, జయద, వినయ్ కాలనీ సభ్యులు పాల్గొన్నారు.