శేరిలింగంపల్లి, మార్చి 7 (నమస్తే శేరిలింగంపల్లి): మహిళలకు చట్టసభల్లో 35% రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టి చట్టాన్ని చేసిన ఘనత బిజెపి, మోదీ ప్రభుత్వానిదేనని బిజెవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, చందానగర్ డివిజన్ బిజెపి కాంటెస్టెడ్ కార్పొరేటర్ కసిరెడ్డి సింధూరెడ్డి అన్నారు. మార్చి 8న మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకొని చందానగర్, దీప్తిశ్రీనగర్ ప్రాంతానికి చెందిన 100 మంది శానిటేషన్ మహిళా, పురుష కార్మికులకు గౌతమీనగర్ మున్సిపల్ పార్కు, చందానగర్ లో చీరలు, ధోతీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సింధూరెడ్డి మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేస్తున్న శానిటేషన్ మహిళలకు అనేక సమస్యలు ఉన్నాయని పరిష్కారం చూపించడం కోసం బిజెపి కృషి చేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళలకు అనేక రకాల పథకాలను అందిస్తున్నదని వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. శానిటేషన్ కార్మికులకు మరింత రక్షణ కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా కసిరెడ్డి సింధూరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు, పురుషులు పాల్గొన్నారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు వనమా శ్రీనివాస్, శ్రీనివాస్ ముదిరాజ్, శివరత్నాకర్, సరిత, జ్యోతి, రాధ, కార్యకర్తలు పాల్గొన్నారు.






