ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని హుడా ట్రేడ్ సెంటర్, శ్రీ సీతారామాంజనేయ దేవాలయం ఆవరణలో సిటిజెన్ హాస్పిటల్, నల్లగండ్ల సౌజన్యంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 2 వరకు ఈ శిబిరం నిర్వహించారు. ఎత్తు, బరువు, రక్తపోటు, షుగర్, కంటి, దంత, పల్స్, ఈ. ఎన్. టీ. పరీక్షలతోపాటు ఈ.సీ.జీ. మొదలగు పరీక్షలు నిర్వహించారు.

ఉచిత వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్లు

డాక్టర్ రాహుల్ ( జనరల్ ఫిజిషన్ ), డాక్టర్ షబ్బీర్ ( డెంటల్), డాక్టర్ అంజాద్ (ఈ.ఎన్.టీ.) డాక్టర్ వైదేహి (నేత్ర వైద్యులు) వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు నిత్య వ్యాయామం, మెడిటేషన్, యోగ, ధ్యానము, నడక, మొదలైనవి కనీసం 40 నిమిషాలు చేయాలని, సాధ్యమైనంత వరకు పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యం కాపాడుకోవాలని తెలిపారు. అనారోగ్యంగా ఉంటే, అశ్రద్ధ చేయకుండా, వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు శ్రీరామ చంద్రమూర్తి, శ్రీనివాస్ గౌడ్, మహేష్ గౌడ్, బుచ్చిరెడ్డి, అమ్మయ్య చౌదరి, చంద్రశేఖర్, జయంత్ కుమార్, లక్ష్మీ సీతారామాంజనేయులు, సత్యనారాయణ, రాము మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విష్ణుప్రసాద్, బాలన్న, హాస్పిటల్ ప్రతినిధి జాకీర్ హుస్సేన్ పాల్గొన్నారు. ఈ వైద్య సిబిరంలో 105 మందికి వైద్య సేవలు అందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here