నాట్యం స్కూల్ విద్యార్థులకు కథకళిపై వర్క్‌షాప్‌

నమస్తే శేరిలింగంపల్లి: ప్రఖ్యాత అంతర్జాతీయ కథాకళి నర్తకి గురు విజయలక్ష్మీ ఆధ్వర్యంలో నాట్యం స్కూల్ ఆఫ్ డ్యాన్స్ శిష్యుల కోసం వర్క్‌షాప్‌ నిర్వహించారు. చందానగర్ అన్నపూర్ణ ఎంక్లేవ్ సాయిబాబా దేవాలయంలో జరిగిన ఈ వర్క్ షాప్ లో కేరళ కు చెందిన గురు కమండలం ప్రసాద్ సోమశేఖరన్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. భారతీయ శాస్త్రీయ నృత్య రూపానికి కీలకమైన శైలి కథకళి అని అన్నారు. దాదాపు 100 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభ పాటవాలను పెంపొందిచుకున్నారు.

విద్యార్థులకు మెళకువలు నేర్పిస్తున్న గురు కమండలం ప్రసాద్ సోమశేఖరన్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here