- మాతృ శ్రీ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో 5K రన్
- కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించిన ప్రభుత్వ విప్ గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాతృ శ్రీ నగర్ కాలనీలో మాతృ శ్రీ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మాతృ శ్రీ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించడం అభినందనియమని , నేటి ఉరుకుల పరుగుల జీవితంలో శారీరక శ్రమ ఎంతో అవసరం అని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాతృ శ్రీ నగర్ కాలనీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ కావూరి, సెక్రటరీ నాగరాజు ,గౌరవ అధ్యక్షులు కన్నయ్య నాయుడు మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.