- అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఈర్ల చెరువులో సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులలో భాగంగా రూ. 7 కోట్ల 73 లక్షల అంచనావ్యయంతో పనులు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరిశీలించారు.
అనంతరం ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఈర్ల చెరువు సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని, చెరువులో కలుషిత నీరు కలవకుండా చేపడుతున్న డ్రైనేజి వ్యవస్థ మళ్లింపు పనులను వేగవంతం చేయాలని, వైశాలినగర్ నుండి ఈర్ల చెరువు అలుగు వరకు డ్రైనేజి వ్యవస్థ మల్లింపు కాల్వ నిర్మాణం పనులకు వేగం పెంచాలని, పనులు నాణ్యత ప్రమాణాల తో చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. చెరువులను సంరక్షణిచడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రసాద్, బాబు మోహన్, మల్లేష్, మల్లేష్ యాదవ్ పాల్గొన్నారు.