- ఎన్నికలేవైనా బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలి
- న్యాయం జరగకుంటే ఎలక్షన్లు జరగనివ్వం
- మొదట చందానగర్, ఆ తర్వాత ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తామంటూ హెచ్చరిక
- తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం
- ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్ ను కోరిన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరీ రామచంద్ర యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : బీసీ కులాల జనగణన గురించి చర్చించేందుకు తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బీసీ ఐక్యవేదిక శేరీలింగంపల్లి కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ హాజరై పత్రికా విలేకరులను ఉద్దేశించి ప్రసంగించారు.
రాష్ట్ర పరిధిలో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీచ జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్, లోకల్ బాడీ ఎలక్షన్స్ లేదా ఏ ఎలక్షన్ లో అయినా బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని బేరి రామచందర్ యాదవ్ ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్ ను కోరారు. అంతవరకు ఎలక్షన్లు మేము జరగనివ్వమని, చందానగర్ లో మొదట ధర్నా చేసిన తర్వాత ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో ధర్నా చేయటానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా ఐక్యవేదిక సమావేశంలో తీర్మానం చేయడం ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ కు తెలియజేయనున్నామని, విద్యా, వైద్యం, తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న సంక్షేమ ఫలాల్లో కూడా 50% బీసీలకు అందాలని పేర్కొన్నారు.
ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో ఢిల్లీలోనూ ధర్నా నిర్వహించి ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. చట్టసభల్లోను 50 శాతం బీసీలకు రిజర్వ్ చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పోరాటంలో బీసీలందరూ ఐకమత్యంతో పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. శేరిలింగంపల్లి అధ్యక్షులు అడ్వకేట్ రమేష్ మాట్లాడుతూ తమ సందేశంలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ వచ్చేవరకు ఏకధాటిగా పోరాడుదామని చెప్పారు. ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్ పోరాటంలో బేరి రామచందర్ యాదవ్ కి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.
యువజన విభాగం అధ్యక్షులు కుమార్ యాదవ్ మాట్లాడుతూ పోరాటమే ఏకైక మార్గంగా కార్యక్రమాన్ని రూపొందించాలని, అడుక్కుంటే అధికారం మనకు ఎవ్వరు ఇవ్వరని పేర్కొన్నారు. యూనివర్సిటీ బీసీ అధ్యక్షులు నరసింహ, లింగంపల్లి అధ్యక్షులు సత్యనారాయణ యాదవ్, గొల్ల కురుమల అధ్యక్షులు మధుసూదన్ యాదవ్, స్టూడెంట్స్ చైర్మన్ శ్రీరామ్ కూడా పోరాటానికి మద్దతు తెలిపారు. ఆర్ కృష్ణయ్య, బేరి రామచంద్ర యాదవ్ కు అండగా ఉంటామని తెలిపారు.
సామాజిక న్యాయమే పరమ విధిగా ముందుకు వెళ్తూ ఆగష్టు 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తూ గ్రామాల నుంచి మండలం జిల్లా వరకు ధర్నాలు, ఎమ్మార్వో, కలెక్టర్లకు మెమొరాండం సమర్పిస్తామని, దానికోసం కార్యచరణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తమ అభిప్రాయాలు, సలహాలను ఆ కమిటీకి సూచిస్తూ నిర్వహించాలని కార్యచరణ 11మంది సభ్యులతో యాక్షన్ ప్లాన్, కార్యచరణ ప్రణాళిక బద్ధంగా చట్టబద్ధంగా ఉద్యమం ముందుకు సాగాలని ఆర్కే సాయన్న పిలుపునిచ్చారు.
ఈ సమావేశానికి శేరిలింగంపల్లి అధ్యక్షులు రమేష్, అడ్వకేట్ మధు యాదవ్, వనపర్తి జిల్లా గొర్ల కాపరి అధ్యక్షులు కుమార్ యాదవ్, యువజన సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ యాదవ్, లింగంపల్లి యాదవ్ సంఘం ఉపాధ్యక్షులు, జేఏసీ స్టూడెంట్స్ చైర్మన్ లింగంపల్లి ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్, పెద్దలందరూ పాల్గొని మద్దతు తెలిపారు.
ఆఖరిగా బీసీ ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి బి. కృష్ణ మాట్లాడుతూ కార్యచరణ ప్రణాళిక చైర్మన్ ఆర్కె సాయన్న, వైస్ చైర్మన్ బి. కృష్ణ 9 మంది సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇకముందు ఏ పోరాట ఉద్యమం కూడా చర్చించి లోపాలను సవరిస్తూ ఆర్ కృష్ణయ్యకి, భేరి రామచందర్ యాదవ్ కి గ్రామస్థాయి నుండి రాజధాని పట్టణం హైదరాబాద్ వరకు పోరాటమే ఉంటుందని తెలిపారు. బీసీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, ప్రతి ఒక్కరూ పాల్గొని ఐకమత్యంతో ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు.
- బీసీ ఐక్యవేదిక ఎజెండా ఇదే
- బీసీ కులాల జనగణన కులాల వారీగా జరిపించాలి, బీసీ కులాల జనాభా డిక్లరేషన్ వెంటనే చేయాలి
- తెలంగాణ రాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికలు గ్రామ వార్డు సర్పంచ్, ఎంపీటీసీ జెడ్పిటీసీ, ఎంపీపీ జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ వార్డు మెంబర్లు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్స్ అన్నింటిలో 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నపం
- తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయమే ఏకైక ఎజెండాగా.. అధికారమే అంతిమ లక్ష్యంగా పోరాటం కొనసాగుతుందని ఐక్యవేదిక ఏకగ్రీవ తీర్మానం
- విద్యా, వైద్యంతో పాటు అన్ని విధాల బీసీలకు సమన్యాయం కోసం ప్రభుత్వానికి మెమొరాండం సమర్పణ
- రాష్ట్ర ప్రభుత్వం జనాభా బీసీల జనగణన పూర్తి అయ్యేవరకు సర్పంచ్ , లోకల్ బాడీస్ ఎన్నికలు జరగనివ్వమంటూ పత్రికా విలేకరుల ద్వారా ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్ కు మొమొరాండం సమర్పణ
- స్థానిక సంస్థ ఎన్నికలన్నింటిలో 50% ఉన్న తమకు రిజర్వేషన్లు కల్పించాలని విన్నపం