దళితుల కుటుంబాలలో సంక్షేమ వెలుగులు

  • రాజారామ్ కాలనీకి చెందిన ముకెందర్ కి ఎర్టీగా కారు మంజూరు
  • లబ్ధిదారుడికి కారును అందజేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
రాజారామ్ కాలనీకి చెందిన ముకెందర్ కి ఎర్టీగా కారును అందజేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: దళితబంధు పథకంలో భాగంగా మాదాపూర్ డివిజన్ పరిధిలోని రాజారామ్ కాలనీకి చెందిన ముకెందర్ కి మంజూరైన ఎర్టీగా కారును హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ లబ్దిదారుడికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ దశలవారీగా దళిత బంధు పథకం పూర్తి స్థాయిలో అమలు అవుతుందని పేర్కొన్నారు. దళితులు వారు ఎన్నుకున్న రంగాలలో మరింత ఉన్నతి సాధించాలని, వారి కుటుంబాలలో వెలుగులు నిండాలని ఆశిస్తున్నానని తెలిపారు. దళిత బంధు పథకం కింద కారు పొందిన లబ్ధిదారుడు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , హఫీజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు నాయి నేని చంద్రకాంత్ రావు, మాచర్ల భద్రయ్య, శ్రీనివాస్ గౌడ్, మల్లేష్, రఘునాథ్, కుమార్, మాధవ్, శ్రావణి రెడ్డి, స్వరూప, ప్రమీల, సదా మాధవి, పర్వీన్ పాల్గొన్నారు.

లబ్ధిదారుడికి స్వీట్ తినిపిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here