నూతన లక్ష్యాలను నిర్దేశించుకుని పని చేయాలి

  • సైబరాబాద్ పోలీస్ సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.,
నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా సీపీ స్టీఫెన్ రవీంద్ర కు కేక్ చేసి తినిపిస్తున్న పోలీస్ ఉన్నతాధికారులు

నమస్తే శేరిలింగంపల్లి:  నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., సిబ్బందితో కలిసి సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ ఆవరణలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీసు సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి జరిగిన వేడుకల్లో సైబరాబాద్ పరిధిలో ఎలాంటి అపశ్రుతులు జరగకుండా జీరో యాక్సిడెంట్ డేగా నిలిచిందన్నారు. గతేడాది సైబరాబాద్ లో 12 శాతం క్రైమ్ రేట్ తగ్గిందన్నారు. ఈ సంవత్సరం కన్విక్షన్ల శాతం పెంచాలన్నారు. సిబ్బంది నూతన లక్ష్యాలను నిర్దేశించుకుని పని చేయాలన్నారు. సిబ్బంది ఈ ఏడాది డ్యూటీ పరంగా కుటుంబ పరంగా బాగుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి, ఐపీఎస్., డిసిపి క్రైమ్స్ సింగనవార్ కల్మేశ్వర్, ఐపీఎస్., సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి టి. శ్రీనివాసరావు, ఐపిఎస్., మాదాపూర్ డిసిపి శిల్పవల్లి, శంషాబాద్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి, బాలానగర్ డిసిపి సందీప్, డిసిపి షీ టీమ్స్ కవిత, డిసిపి అడ్మిన్ ఇందిరా, సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడిసిపి రియాజ్, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ సిబ్బంది, సి‌ఏ‌ఓ లు గీత, చంద్రకళ, సైబరాబాద్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి, జాయింట్ సెక్రెటరీ వెంకటయ్య, ఆర్గనైజేషన్ సెక్రటరీ కృష్ణారెడ్డి, సైబరాబాద్ కోశాధికారి జి. మల్లేశం, సీపీ ఆఫీస్ సిబ్బంది, సెక్షన్ల సిబ్బంది పాల్గొన్నారు.

నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న పోలీస్ అధికారులు, సిబ్బందితో సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.,

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here