నమస్తే శేరిలింగంపల్లి: రోజురోజుకూ సైబర్‌నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వీటిపై పౌరుల సందేహాలు తీర్చేందుకు సైబరాబాద్ పోలీసులు హెల్ప్‌లైన్ నెంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. అపరిచిత వ్యక్తుల నుండి బహుమతులు గెలుచుకున్నారని, ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి ఉంచిన వస్తువులను కొంటామని, జాబ్‌కు సెలెక్ట్ అయ్యారని, అందుకు సంబంధించిన ఫీజులు చెల్లించాలంటూ కాల్స్ వచ్చినప్పుడు కలిగే సందేహాలను నివృత్తి చేసేందుకు సైబరాబాద్ పోలీసులు రెండు హెల్ప్‌లైన్ నెంబర్లను అందుబాటులో ఉంచారు. 9491617310, 040-27854031 నెంబర్లకు ఉదయం 9గం.ల నుండి సా. 8గం.ల వరకు ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవడంలో సహాయం అందిస్తున్నట్లు సూచించారు.