నమస్తే శేరిలింగంపల్లి: రంగారెడ్డి (అర్బన్) జిల్లా బీజేపీ గిరిజన మోర్చా అధ్యక్షుడిగా నియమితులైన హనుమంత్ నాయక్ మాజీ శాసనసభ్యులు, శేరిలింగంపల్లి బిజెపి నాయకులు ఎం.భిక్షపతియాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం మసీద్ బండలోని బిక్షపతి యాదవ్ నివాసంలో కలిసి పుష్ఫగుచ్ఛం సమర్పించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా బిక్షపతియాదవ్ మాట్లాడుతూ కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందని, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






