నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ బిజెపి ఇంచార్జి ఉప్పల విద్యా కల్పన ఏకాంత్ గౌడ్ కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజలకు, బిజెపి నాయకులకు, కార్యకర్తలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గణేష్ గౌడ్, వెంకటేష్, యాదగిరి, సంతోష్ కుమార్, జితేందర్, తిమ్మయ్య, వినోద్, రాజు గౌడ్, సంతోష్, రణధీర్ రెడ్డి, సాయి కుమార్, గోపి, దినేష్, తదితరులు పాల్గొన్నారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలతో హోళీ సంబురాల్లో ఉప్పల విద్యా కల్పన ఏకాంత్‌గౌడ్





