నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శనివారం వర్ణ ఆర్ట్స్ అకాడమీ స్మిత మాధవ్ శిష్య బృందం చేసిన భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. పుష్పాంజలి, దేవి వందనం, గణేశా వందనం, అలరిపు, కామాక్షి స్వర జాతి, ధనశ్రీ తిల్లాన అంశాలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శన లో కళాకారులు ధన్వి కృష్ణ, మేఘన, సహస్ర, అదితి, అమేయ, అక్షర, తనయ, శ్రీ లాస్య తదితరులు పాల్గొన్నారు.
