శేరిలింగంపల్లి, మార్చి 12 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని FCI కాలనీ పార్కులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్, కార్యక్రమ నిర్వాహకుడు అట్టేపల్లి రామప్రభు సమక్షంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు, చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు, వినోదాన్ని అందించేందుకు మ్యూజికల్ చైర్, ప్రొటెక్ట్ యువర్ బెలూన్, ఫిల్ ది వాటర్ బాటిల్, టగ్ ఆఫ్ వార్ వంటి వినోదాత్మక ఆటలను నిర్వహించారు. పోటీల్లో విజేతలకు మొదటి బహుమతిగా రూ.5,000 విలువైన గిఫ్ట్, రెండవ బహుమతిగా రూ.3,000 విలువైన గిఫ్ట్ ప్రకటించారు. అలాగే పాల్గొన్న మహిళలందరికీ ప్రోత్సాహక బహుమతులు కూడా ప్రకటించారు.

ఈ సందర్భంగా అట్టేపల్లి రామప్రభు మాట్లాడుతూ మహిళలు కుటుంబ వ్యవస్థకు మూలస్తంభాలని, వారి కృషి వల్లనే సమాజం సుస్థిరంగా నిలుస్తుందని తెలిపారు. మహిళలకు గౌరవం, అవకాశాలు, ప్రోత్సాహం అందించడం ద్వారా సమాజం మరింత బలపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జయంశంకర్, విజయ్, శంకర్, సురేష్, బాబ్జి, చంద్రిక, సువీణ సింధూర, రాజేశ్వరి, మానస, ప్రీతి, అరుణ, సుమలత, నర్మద, FCI కాలనీ, చిరంజీవి నగర్, అమన్ కాలనీ, SR ఎస్టేట్స్, TN నగర్, పోట్లపల్లి రెసిడెన్సీ, హేమదుర్గ అపార్ట్‌మెంట్స్ కమిటీ సభ్యులు, ARP టీమ్ సభ్యులు, కాలనీ మహిళలు, పిల్లలు, నివాసితులు పాల్గొన్నారు.





