ముస్లింల అభివృద్ధికి ప్ర‌భుత్వం కృషి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, మార్చి 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రంజాన్ మాసంను పురస్కరించుకుని మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్, నవభారత్ నగర్ కాలనీలలో నిర్వ‌హించిన దుస్తుల‌ పంపిణీ కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ముస్లింలకు దుస్తుల‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింద‌ని అన్నారు. ముస్లింల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని , పేద ముస్లిం కుటుంబాలకు పండుగ రోజున వెలితి లేకుండా, వారికి ఎటువంటి లోటులేకుండా పండుగను సంతోషకరంగా జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, సాంబశివరావు, అబ్దుల్ రహమాన్, ఆఫ్రోజ్, అంకారావు, సాదిక్, సత్యం గుప్తా, హరికృష్ణ, కార్యకర్తలు, ముస్లిం మత పెద్దలు, ముస్లింలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here