శేరిలింగంపల్లి, మార్చి 13 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ క్రమబద్దీకరణ వల్ల వాహనదారులు ఎలాంటి అడ్డంకి లేకుండా రాకపోకలను కొనసాగిస్తున్నారని సీఐ ప్రశాంత్ తెలిపారు. మియాపూర్ ఎక్స్ రోడ్డులో సర్వీస్ రోడ్డు ప్రారంభానికి ముందు ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉందని, కానీ తర్వాత ట్రాఫిక్ పరిస్థితి మారిందని, వాహనదారులు సులభంగా వెళ్లగలుగుతున్నారని తెలిపారు. ప్రస్తుతం సీసీ రోడ్డు, ఆర్టీసీ బస్ సర్వీస్ రోడ్డు ప్రారంభించిన తర్వాత ట్రాఫిక్ బాగా మెరుగుపడిందని అన్నారు. వాహనాలు సాఫీగా సాగిపోతున్నాయని, ఇంతకుముందు ఉన్న రద్దీ తగ్గిందని తెలిపారు.






