నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల అపర్ణ సైబర్ జోన్ గేటెడ్ కమ్యూనిటీ వద్ద చేపట్టనున్న రోడ్డు విస్తరణ లో ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూస్తామని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి హామీనిచ్చారు. రోడ్డు విస్తరణ పనులతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని సైబర్ జోన్ గేటెడ్ కమ్యూనిటీ వాసులు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ అపర్ణ సైబర్ జోన్ గేటెడ్ కమ్యూనిటీ లో సుమారు పదిహేను వందల కుటుంబాలు నివాసం ఉంటున్నారని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇబ్బంది లేకుండా చూస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రవీందర్ బాబు, అపర్ణ సైబర్ జోన్ గేటెడ్ కమ్యూనిటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ సింగ్, జనరల్ సెక్రటరీ శ్యామ్, సుబ్బా రావు, అపర్ణ సైబర్ జోన్ వాలంటీర్స్ నీలిమ యోగి , పట్నాయక్ ,మధువంటి కాలే, దిగ్విజయ్ సింగ్, పునీత్ టవర్, అపర్ణ సైబర్ జోన్ గేటెడ్ కమ్యూనిటీ వాసులు శశిభూషణ్, విమల్, మనీష్ కుమార్, అజయ్ రెడ్డి, మధు, శివ, సుబ్రాట్, అభిషేక్, ప్రతాప్, రఘువీర్, అదితి, హరిప్రియ, విమల్, అర్చన, సత్యజిత్, లలిత్ చౌదరి, అఖిలేష్, అభిజీత్, స్వాతి గుప్త, మురళి కృష్ణ, గిరిజ , రంజిత్, అనిలా, దుట్టా, ప్రస్సన్న, రాకేష్, లీల, తేజేష్, శ్రీనివాస్, బబిత, అక్షయ్, శ్రీకాంత్, ఆనంద్ మోహన్, బ్రిజేష్, పవన్ చక్రవతే, సౌమిత్రా భొమ్మికా, అమిత్, జోయదీప్, రామ్, మాణిక్ లాల్ దత్త, టోనీ, దిగ్విజయ్ చౌహన్, రాజేష్ కుమార్, పునీత్ , ప్రసన్న, శ్రీపతి, భవాని, అరుణభా ముఖర్జీ తదితరులు పాల్గొన్నారు.