శేరిలింగంపల్లి, మార్చి 13 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట గ్రామంలో మసీదు కమిటీ ఆధ్వర్యంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని ఈద్ కా తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి హాజరై ఈద్ కా తోఫా కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ పండుగ పరస్పర ప్రేమ, త్యాగం, సమానత్వంలకు ప్రతీక అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అందిస్తున్న ఈద్ కా తోఫా పథకం ద్వారా పేద, అవసరమైన ముస్లిం కుటుంబాలకు పండుగ సందర్భంగా ఆర్థిక భారం తగ్గుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్, రవీందర్ రావు, అక్బర్ ఖాన్, యూసుఫ్ అలీ, మసీదు కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, మహిళలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






