నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో గుజరాత్ చేనేత హస్తకళల ఉత్సవ్ సందర్బంగా శిల్పారామం ఎథ్నిచ్ హాల్ లో సోమవారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బిందు మాధవి శిష్య బృందం చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన అందరిని అలరించింది. గణపతి స్తుతి, కొలువైతివా రంగ సాయి, శివాష్టకం, మరకత మణిమయ, రామాయనామ్, తక్కువేమి మనకు (రామదాసు కీర్తన) తదితర అంశాలపై కూచిపూడి నృత్యప్రదర్శన చేశారు. కళాకారులు స్నేహ, కీర్తన, భవ్య, లక్ష్మి ప్రసన్న, అపూర్వ, జగతి మానస, అశ్విత తదితరులు ప్రదర్శించిన ప్రదర్శనలతో పలువురిని మెప్పించారు.