వ‌ర్షంలోను ఉత్సాహంగా భార‌త్ బంద్‌లో పాల్గొన్న శేరిలింగంప‌ల్లి అఖిల ప‌క్షం – కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిపై నేత‌ల మండిపాటు

నమస్తే శేరిలింగంపల్లి: కార్మిక,‌ కర్షక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల పక్షం భారత్ బంద్ కార్యక్రమాన్ని చేపట్టింది. భారత్ బంద్ లో భాగంగా శేరిలింగంపల్లి లో అఖిల పక్ష పార్టీలు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఒక పక్క కుండ పోత వర్షం పడుతున్నా.. వర్షం లో తడుస్తూనే ర్యాలీ నిర్వహించారు. బంద్ కు స్వచ్చందంగా సహకరించాలని వ్యాపార, వాణిజ్య వర్గాలను కోరుతూ చందానగర్ నుండి తారానగర్ వరకు బంద్ చేపట్టారు. ఈ సందర్బంగా కాంగ్రెస్, సిపిఐ, సీపీఎం నాయకులు మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, వ్యవసాయ రంగాన్ని కాపాడాలని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, వాటిని తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగం సంస్థలను అమ్మటం ఆపాలని డిమాండ్ చేశారు. మోడీ, కేసీఆర్ లకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు.

చందాన‌గ‌ర్‌లో వ‌ర్షంలోను ఉత్సాహంగా బంద్‌లో శేరిలింగంప‌ల్లి అఖిల‌ప‌క్షం నేత‌ల సంద‌డి

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జెరిపేటి జైపాల్, రఘునందన్ రెడ్డి, మహిపాల్ యాదవ్, మన్నే సతీష్, ఇలియాజ్, షరీఫ్, టీడీపీ కుర్ర మహేష్, సీపీఐ నాయకులు టి రామకృష్ణ, చందు యాదవ్, సీపీఎం నాయకులు చల్లా శోభన్ బాబు, కృష్ణ, బిఎస్పీ శ్యామ్, సురేష్ నాయక్, రావేళ్ల రాజేష్, అయాజ్ ఖాన్, జావిడ్ ఉస్సేన్, అజిమిద్దీన్, జహంగీర్, యువజన కాంగ్రెస్ నాయకులు రాజన్, మందుల సైదులు,శ్రీహరి గౌడ్, రాజేష్ గౌడ్,  పోచయ్య,స్వామి నాథ్, నరసింహ గౌడ్, తిరుపతి, రాజేందర్, దుర్గేష్, ఫయాజ్, ఖాజా, దుర్గాదాస్, సాయి కిషోర్, ఎస్ఎఫ్ఐ నాయకులు శివ దుర్గారావు, ఆసిఫ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

భారత్ బంద్ లో పాల్గొన్న శేరిలింగంపల్లి అఖిలపక్షం నేతలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here