నమస్తే శేరిలింగంపల్లి: వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సూచించారు. సోమవారం కురిసిన వర్షానికి లింగంపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిల్వ ఉండకుండా స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు చేపట్టారు. క్షేత్ర స్థాయిలో రైల్వే బ్రిడ్జి వద్దకు వెళ్లి జీహెచ్ఎంసీ సిబ్బందితో నీటిని తొలగింపజేసి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూశారు. అనంతరం తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఆర్టీసీ ప్రయాణం అన్ని విధాల సౌకర్యవంతమైందన్నారు.
