బిజెపి రాష్ట్ర ప్రొఫెషనల్ సెల్ కన్వీనర్ గా బాల్ద అశోక్

శేరిలింగంప‌ల్లి, మార్చి 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు, అఖిల భారత కనీస వేతన సంఘం మాజీ సభ్యుడు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేపథ్యంతో ఎన్నో సేవాకార్యక్రమాలు చేసిన బాల్ద అశోక్ బీజేపీ రాష్ట్ర ప్రొఫెషనల్ సెల్ కన్వీనర్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా బాల్ద అశోక్ మాట్లాడుతూ సమాజంలో అనేక రంగాలలో ఉన్న ప్రొఫెషనల్స్ కు ప్ర‌ధాని నరేంద్రమోడీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించి పార్టీలోకి ఆహ్వానిస్తానని అన్నారు‌. తెలంగాణ రాష్ట్రంలోని ప్రొఫెషనల్స్ ని బిజెపి వైపు అడుగులు వేయించి పార్టీ అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తానని అన్నారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన బిజెపి రాష్ట్ర, జాతీయ నాయకత్వానికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here