చందాన‌గ‌ర్‌లో యువ‌తి అదృశ్యం

చందాన‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కాలేజీకి వెళ్తున్నాన‌ని చెప్పి ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన ఓ యువ‌తి అదృశ్య‌మైంది. చందాన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకున్న ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. శేరిలింగంప‌ల్లిలోని ఓల్డ్ ఎంఐజీ ఫేజ్‌-2లో నివాసం ఉండే బి.నాగ‌మ్మ స్థానికంగా కూలిప‌నులు చేస్తూ జీవ‌నం సాగిస్తోంది. ఆమెకు ఇద్ద‌రు కుమారులు, ఒక కుమార్తె. కుమార్తె పేరు బి.రేణుక (19). ఆమె మ‌దీనాగూడ‌లోని విజేత వుమెన్స్ డిగ్రీ కాలేజీలో చ‌దువుతోంది. ఈ క్ర‌మంలోనే ఈ నెల 5వ తేదీన ఉద‌యం 10 గంట‌ల‌కు కాలేజీకి వెళ్తున్నాన‌ని చెప్పిన ఆమె ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లింది. అదే రోజు మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆమె త‌ల్లికి ఫోన్ కాల్ చేసి ఇంటికి వ‌స్తున్నాన‌ని చెప్పింది. త‌రువాత ఇంటికి రాలేదు. దీంతో ఆమె ఆచూకీ కోసం కుటుంబ స‌భ్యులు అన్ని చోట్లా గాలించారు. అయినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా, పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

రేణుక (ఫైల్‌)
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here