శేరిలింగంపల్లి, నవంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండల గుర్తింపు పొందిన ప్రయివేట్ పాఠశాలల యాజమాన్య సంఘం అసోసియేషన్ ఆధ్వర్యంలో చందానగర్ డివిజన్ పరిధిలోని PJR స్టేడియంలో ఈనెల 22 వ తేదీ వరకు నిర్వహించనున్న క్రీడా ఉత్సవాలు – స్పోర్ట్స్ మీట్- 2024 కార్యక్రమాన్ని MEO వెంకటయ్యతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో MD ఇబ్రహీం, లయన్ డా.వేంకటేశ్వర రావు, ఆచార్య శ్రీనివాస్ శంకర్, రెహ్మాన్, అనిల్ కుమార్, ఎన్.ఎస్.రావు, భీస్మారెడ్డి, భరత్ కుమార్, రాజు, విజయ్, ప్రద్యుమ్న, ప్రవీణ్, పవన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.