స‌బ్ స్టేష‌న్ల నిర్మాణం కోసం స్థ‌లం కేటాయించాలి: PAC చైర్మన్ గాంధీ

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సబ్ స్టేషన్ల నిర్మాణం కోసం మయూరి నగర్ లో ఒక ఎకరం, నల్లగండ్ల హుడా కాలనీలో ఒక ఎకరం చొప్పున స్థలం కేటాయించాలని, సబ్ స్టేషన్ ల నిర్మాణం కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ కోరారు. అమీర్ పేట్ లోని HMDA కార్యాలయంలో కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ని మర్యాదపూర్వకంగా కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మయూరి నగర్, నల్లగండ్ల హుడా కాలనీలలో ప్రజా సౌకర్యార్థం కాలనీల సౌకర్యాల కోసం కేటాయించిన స్థలంలో సబ్ స్టేషన్ ల నిర్మాణం కోసం ఒక ఎకరం స్థలం కేటయించేలా అనుమతి ఇవ్వాలని, సబ్ స్టేషన్ నిర్మాణం కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని PAC చైర్మన్ గాంధీ వినతి పత్రం ద్వారా కోరారు.

HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తో చ‌ర్చిస్తున్న PAC చైర్మన్ గాంధీ

అతి పెద్ద కాలనీలు ఆయిన మయూరి నగర్, నల్లగండ్ల హుడా కాలనీలలో 1 ఎకరం స్థలం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని, ఆ స్థ‌లంలో సబ్ స్టేషన్ నిర్మించుకోవడానికి ఎంతగానో తోడ్పడతుంద‌ని, పెద్ద కాలనీలు కావడం వలన నిత్యం కరెంట్ అంతరాయం ఏర్పడుతుంద‌ని కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు అని, ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్ అందించాలంటే ఆ ప్రాంతంలో సబ్ స్టేషన్ల నిర్మాణం అవసరం ఎంతగానో ఉంద‌ని, సబ్ స్టేషన్ నిర్మాణం వలన ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంద‌ని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని HMDA పరిధిలోని ప్రభుత్వ స్థలాలను, పార్క్ లను పరిరక్షించాలని కోరారు. దీని పై HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ సానుకూలంగా స్పందించార‌ని గాంధీ తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here