శేరిలింగంపల్లి, నవంబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి తండా సీనియర్ నాయకుడు శ్రీరామ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ హరిహరసుతుడు అయ్యప్పను కొలవడం ద్వారా ఆపదలు తొలగి అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు చేకూరుతాయి.శరణంటూ ఆశ్రయించిన వారిని కాపాడే దైవం హరిహర సుతుడు అయ్యప్ప అని అన్నారు. స్వామి వారి పడిపూజ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ప్రజలపై అయ్యప్ప స్వామి వారి చల్లని చూపు తప్పక ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షుడు శివసింగ్, సీనియర్ నాయకులు నర్సింగ్ నాయక్, ప్రభాకర్, ప్రకాశ్, బాబులు నాయక్, అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.