శ్రీ‌రంగాపురం కాల‌నీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి: కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్‌

మియాపూర్, న‌వంబ‌ర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరంగాపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు మియాపూర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్ ని ఆయ‌న నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను ఉప్పలపాటి శ్రీకాంత్ అభినందించారు. అనంతరం ఆయ‌న మాట్లాడుతూ శ్రీరంగాపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయ‌ని, ఏ చిన్న సమస్య అయినా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బాలు చౌదరి, శ్రీనివాస్ రావు, నర్సింహులు, రవి, నరేష్, బిఆర్ చౌదరి, శ్రీరంగాపురం అసోసియేషన్ సభ్యులు కేశవరావు, మూర్తి రాజు, పివి సుబ్బారావు, శ్రీరాములు, బి ప్రసాద్, రమేష్, రెడ్డి, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్‌తో శ్రీ‌రంగాపురం కాల‌నీ నూత‌న కార్య‌వ‌ర్గ స‌భ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here