ఆటో, రవాణా కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం ఆగదు: ఆటో, ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ ఐకాస

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ఆటో & ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ యూనియన్స్ ఐకాస ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో డ్రైవర్ల సదస్సు నిర్వ‌హించారు జరిగింది. ఈ సదస్సులో బి.పి.టి.ఎం.ఎం జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి, TNTUC యాదగిరి, TATU రవి, ఈశ్వర్, NTADU రవి కుమార్, BMS ఆటో యూనియన్ ప్రధాన కార్యదర్శి బి.పెంటయ్య గౌడ్, TADU కొమరయ్య, JSPTU BMS హాబీబ్, JBS శ్రీనివాస్, కిషన్, TALKS శ్రీధర్ రెడ్డి, స్కూల్ వాన్ డ్రైవర్స్ యూనియన్, వజ్ర లింగం, సాయొలు, శ్రీనివాస్ ముదిరాజ్, జహంగీర్, అంబులెన్స్ యూనియన్ నాయకులు వెంకటేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రైవర్ల సమస్యల‌ను పరిష్కరించడంలో, సంక్షేమం అందించడంలో చొరవ చూపడం లేదు సరికదా ట్రాఫిక్ పోలీస్ ల ద్వారా ఈ-చ‌లాన్లు అధికంగా వేయ‌డం జరుగుతోంద‌న్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, ఆత్మ హత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, డబుల్ బెడ్ రూం ఇళ్ల‌ను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న ఆటో డ్రైవ‌ర్లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here