శేరిలింగంపల్లి, నవంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆటో డ్రైవర్లు భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ఓలా, ఊబర్, రాపిడో బైకులను నిషేధించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 25 నవంబర్ న ఇందిరాపార్క్ వద్ద జరిగే ఐకాస మహాధర్నాలో పెద్దఎత్తున పాల్గొనాలని లింగంపల్లి ఆటో యూనియన్ కార్యదర్శి రాజు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రైవర్లకు ఇస్తామన్న రూ.12000 ఇవ్వక పోయినా ఫర్వాలేదు కానీ మహిళలకు ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం ఎత్తివేయాలని తద్వారా డ్రైవర్ల ఆత్మ హత్యలు అరికట్ట వచ్చని BMS ఆటో యూనియన్ అధ్యక్షుడు యాదవ్ అభిప్రాయ పడ్డారు. ఈ భిక్షాటనలో లింగంపల్లి ఆటో యూనియన్ అధ్యక్షుడు యాదగిరి, కార్యదర్శి రాజు, నజీర్, యూసఫ్, జాని తదితరులు పాల్గొన్నారు.