సీఎంసీ వాక్ ఫ్రీ డ్రైవ్.. 14.1 కి.మీ పరిధిలో 290 ఆక్రమణల తొలగింపు

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రజలకు రోడ్లు, ఫుట్‌పాత్‌లు అడ్డంకులు లేకుండా అందుబాటులో ఉండేలా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) చేపడుతున్న వాక్ ఫ్రీ కార్యక్రమంలో భాగంగా మరోసారి భారీ స్థాయిలో ఆక్రమణల తొలగింపు డ్రైవ్ నిర్వహించారు. మూడు జోన్ల పరిధిలో మొత్తం 14.1 కిలోమీటర్ల మేర 290 ఆక్రమణలను తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలో 4.7 కి.మీ మేర 85 ఆక్రమణలను తొలగించారు. ఇందులో నార్సింగిలో 33, అమీన్‌పూర్‌లో 17, మియాపూర్‌లో 25, శేరిలింగంపల్లిలో 10 ఆక్రమణలు ఉన్నాయి. కూకట్‌పల్లి జోన్ లో 3.1 కి.మీ పరిధిలో 55 ఆక్రమణలను తొలగించారు. మాధాపూర్, ఆల్విన్ కాలనీల్లో చెరో 14, కూకట్‌పల్లిలో 15, మూసాపేట్‌లో 12 ఆక్రమణలు తొలగించారు.

కుత్బుల్లాపూర్ జోన్ లో అత్యధికంగా 6.3 కి.మీ పరిధిలో 150 ఆక్రమణలను తొలగించారు. చింతల్‌లో 14, జీడిమెట్లలో 24, కొంపల్లిలో 35, గాజులరామారంలో 20, నిజాంపేట్‌లో 26, దుండిగల్‌లో 16, మేడ్చల్‌లో 15 ఆక్రమణలను తొలగించారు. ఆక్రమణలు తొలగించిన ప్రాంతాల్లో మళ్లీ ఆక్రమణలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేపడతామని సీఎంసీ అధికారులు తెలిపారు. రోడ్లు, ఫుట్‌పాత్‌లు, ప్రజా ప్రదేశాలను ఆక్రమణల రహితంగా, సురక్షితంగా ఉంచేందుకు వాక్ ఫ్రీ కార్యక్రమాన్ని సైబరాబాద్ వ్యాప్తంగా నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here