కొండాపూర్‌లో భారీ ఉచిత మెగా మెడికల్ క్యాంప్.. CR పాలీక్లినిక్‌లో ఆగస్టు 8న ఆరోగ్య సేవలు

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ప్రజలకు ఉచిత ఆరోగ్య సేవలను అందించేందుకు CR ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారీ మెగా మెడికల్ క్యాంప్ (Mega Medical Camp) నిర్వహించనున్నారు. IDPD తెలంగాణ, రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మావెరిక్స్ సహకారంతో, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఆశావహుడు ఎండీ అలావుద్దీన్ పటేల్, CR ఫౌండేషన్ సంయుక్తంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

ఈ ఉచిత వైద్య శిబిరం ఆగస్టు 8, శనివారం కొండాపూర్‌లోని CR పాలీక్లినిక్ లో జరగనుంది. శిబిరంలో నిపుణులైన వైద్యులు ఉచిత వైద్య సలహాలు అందించడంతో పాటు, అవసరమైన రోగ నిర్ధారణ పరీక్షలను కూడా ఉచితంగా నిర్వహించనున్నారు. ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను సులభంగా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here