నమస్తే శేరిలింగంపల్లి : అన్నమాచార్య భావనా వాహిని సంస్థ వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ డా. శోభారాజు ఆధ్వర్యంలో అన్నమయ్యపురంలో ప్రతి శనివారం నిత్య కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం, అన్నమయ్య అష్టోత్తరం,”శ్రీ నందకాయ” అన్నమ గాయత్రి “శ్రీ మద్వదీయ చరితామృత” అనే అన్నమయ్య గురుస్తుతితో ప్రారంభించారు.
అనంతరం ” కూచిపూడి నృత్యాలయ కళాక్షేత్రం” గురువులు జ్యోతి మరదాని, ఆయన శిష్య బృందృం “కాశి రెడ్డి యుక్న్తుతి, దృతిక లక్షియ రెడ్డి, ఐరా శుక్ల, శాన్వి, అనుశ్రీ, నాగ శ్రీధృతి, శ్రీ వింధ్య, తన్వి, అదితి మైత్రేయి, నక్షత్ర, నేపత్య యాదవి, దీక్షిత, సమీక్ష రెడ్డి, అధితి, సాయి శ్రావ్య, దిదీప్య, సాత్విక, రితిష, పద్మ అక్షయ, జోషిత రెడ్డి, లోహిత, స్పూర్తి, గాయత్రి, రక్షిత” సంయుక్తంగా “వినాయక కౌత్వం, దశావతార శబ్దం, రామాయణ శబ్దం, కలింగ నర్తన తిల్లాన, దేవదేవం, నారాయణ శబ్దం” అనే ప్రఖ్యాత సంకీర్తనలకు చేపట్టిన కూచిపూడి నృత్య ప్రదర్శన అలరించింది. అనంతరం సంస్థ అధ్యక్షులు డా. శోభా రాజు కళాకారులని శాలువా, జ్ఞాపికతో సత్కరించారు.