లింకు రోడ్ల నిర్మాణంతో రవాణా సమస్యలు దూరం: కార్పోరేటర్ జగదీశ్వర్ గౌడ్

మాదాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో లింకు రోడ్ల నిర్మాణం తో ట్రాఫిక్ సమస్యలతో పాటు వాహనదారులకు రవాణా సమస్యలు దూరమవుతాయని స్థానిక కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. సోమవారం భూ సమీకరణ విభాగం డిసిపి, సిటీ ప్లానర్ ఏకే.రెడ్డితో పాటు పలువురు అధికారులతో కలిసి మాదాపూర్ లో పర్యటించిన ఆయన లింకు రోడ్ల నిర్మాణం కోసం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ మాదాపూర్ వంటి ప్రాంతాల్లో నివసించే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోందని, వారికి అనుగుణంగా రవాణా సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. లింకు రోడ్ల నిర్మాణంతో ఓలు కాలనీవాసులకు ప్రయాణం సులభతరమవుతుందన్నారు. ఈ పర్యటనలో చందానగర్ సిటీ ప్లానర్ శ్రీనివాస్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ సంపత్ కుమార్ తదితరులు ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here