చందానగర్: చందానగర్ డివిజన్ పరిధిలోని టెలిఫోన్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవతరెడ్డి పర్యటించారు. స్థానికంగా నెలకొన్న రోడ్లు, వీధిదీపాలు తదితర సమస్యలను కాలనీవాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా కలనీవాసులతో కలిసి పర్యటించిన ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నవతరెడ్డి మాట్లాడుతూ కాలనీ ప్రధాన రహదారి నిర్మాణం కోసం ఐదు లక్షల నిధులు మంజూరై టెండర్ల ప్రక్రియ సైతం పూర్తయిందని, త్వరలోనే పనులు పూర్తయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. వీధి దీపాల సమస్యపై సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు, పెంటయ్య, శ్రీను, నాగభూషణం, బాలమని, ప్రమీల, సహారదా, వరలక్ష్మీ, పాస్టర్ నాతానిల్ తదితరులు పాల్గొన్నారు.
త్రాగు నీరు మరియు UGD సమస్యలను పరిష్కరించండి: కార్పొరేటర్ నవతరెడ్డి
చందానగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో నెలకొన్న త్రాగు నీరు మరియు భూగర్భ డ్రైనేజి సమస్యలను పరిష్కరించాలని స్థానిక కార్పొరేటర్ నవతరెడ్డి జలమండలి అధికారులను కోరారు. సోమవారం హెచ్ఎండబ్ల్యుఎస్ జనరల్ మేనేజర్ రాజశేఖర్ తో సమావేశమైన నవతరెడి త్రాగునీరు, డ్రైనేజి తదితర సమస్యలను వివరించారు. జవహర్ కాలనీ రోడ్డు నెంబర్ 4 లో మరియు చందానగర్లో లీకేజీల కారణంగా నీరు కలుషితమవుతోందని పైప్ లైన్ కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. చందానగర్ డివిజన్ లో పలు కాలనీలలో భూగర్భ డ్రైనేజీ కొత్త లైన్ల అవసరం ఉందని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన అధికారులు సమస్యలు పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చినట్లు కార్పొరేటర్ తెలిపారు.