- అధికారులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఆదేశం
- రామసముద్రం కుంట చెరువు ప్రాంతంలో చేపట్టాల్సిన పనుల పరిశీలన
నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని రామసముద్రం కుంట చెరువు ప్రాంతంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై GHMC ఇంజనీరింగ్ విభాగం, ఇరిగేషన్ అధికారులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామసముద్రం కుంట చెరువు సుందరీకరణలో భాగంగా చెరువు కట్ట పటిష్టం చేసేలా పునరుద్ధరణ, మురుగు నీరు చెరువులో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి కాల్వ (UGD) నిర్మాణం, అలుగు మరమ్మతులు, చెరువు కట్ట బలోపేతం, వాకింగ్ ట్రాక్ పనులు చేపడుతామని పేర్కొన్నారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్ (కంచె) ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చెరువు సుందరీకరణ, అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో GHMC ఈ ఈ శ్రీక్రాంతిని, ఇరిగేషన్ డి ఈ నళిని, ఏఈ శివ ప్రసాద్, వర్క్ ఇన్ స్పెక్టర్లు రఘు, నవీన్ పాల్గొన్నారు.
