శేరిలింగంపల్లి: మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గిఫ్ట్ ఎ స్మైల్ లో భాగంగా కరోనా వ్యాధిగ్రస్తుల సహాయార్థం ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో తెరాస సీనియర్ నాయకుడు వాసిలి చంద్రశేఖర ప్రసాద్ తన సొంత ఖర్చులతో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి ఒక కరోనా అంబులెన్స్ తయారీకి కావాల్సిన డబ్బులు రూ.20.50 లక్షలను చెక్కు రూపంలో బుద్ధ భవన్ లో మంత్రి కేటీఆర్‌కి అందజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకుడు వాలా హరీష్ రావు తదితరులు పాల్గొన్నారు.