- విద్యార్థినులనుద్దేశించి మాట్లాడిన చందానగర్, రామచంద్రాపురం సీఐలు
- లింగంపల్లి లోని త్రివేణి పాఠశాలలో రాఖీ పౌర్ణమి
- ఆయా పోలీస్ స్టేషన్లకు వెళ్లి రాఖీ కట్టిన విద్యార్థినులు
నమస్తే శేరిలింగంపల్లి: లింగంపల్లి లోని త్రివేణి పాఠశాలలో రాఖీ పౌర్ణమి ఉత్సవాలు వేడుకగా నిర్వహించారు. ఇందులో భాగంగా చందానగర్ పోలీస్ స్టేషన్, రామచంద్రపురం ట్రాఫిక్ పోలీసు స్టేషన్ లలో సిబ్బంది ని కలిసి రాఖీ కట్టి వారి ఆశీర్వచనం పొందారు. ఈ సందర్భంగా చండానగర్ పోలీసు స్టేషన్ సీఐ, రామచంద్రపురం ట్రాఫిక్ సీఐ పవన్ విద్యార్థినులనుద్దేశించి మాట్లాడారు.
చదువులలో రాణించి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని తెలిపారు దేశానికి మంచి గుర్తింపు వచ్చేలా కష్టపడి చదవాలని సూచించారు. రాఖీ పండుగ దేశ సమైక్యతను బంధాలను బలపరుస్తూ.. దేశ పురోభివృద్ధికై సమైక్య తోడ్పాటుకు దోహదపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో త్రివేణి పాఠశాల డైరెక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి, సిఏసిడి డాక్టర్ నటరాజ్, సిఆర్ఓ సాయి నరసింహ రావు, ఏ సి ఆర్ ఓ నరేష్, ప్రిన్సిపల్ అనితారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు