త్రిదండి చిన‌జీయ‌ర్ స్వామీ చేతుల మీదుగా ఖాజాగూడ‌ ఆలయల ప్ర‌తిష్టాప‌న‌

ఆల‌య ప్ర‌తిష్టాప‌న కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగిస్తున్న చిన‌జీయ‌ర్ స్వామి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: కొమ్మిరిశెట్టి ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఖాజాగూడ‌లోని సాయి ఐశ్వర్య కాలనీ లో నూతనంగా నిర్మించిన శ్రీ ముత్యాలమ్మ‌, మ‌ర‌త‌క లింగం ప్ర‌తిష్టాప‌న కార్య‌క్ర‌మాన్ని త్రిదండి శ్రీ‌మ‌న్నారాయ‌ణ రామానుజ జీయ‌ర్ స్వామి చేతుల మీదుగా గురువారం వైభ‌వోపేతంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా విగ్ర‌హ ప్ర‌తిష్టాప‌న కార్య‌క్ర‌మంతో పాటు ప్ర‌త్యేక హోమాలు, పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల్లో శేరిలింగంప‌ల్లి శాస‌న‌స‌భ్యులు ఆరెక‌పుడి గాంధీ, కార్పొరేట‌ర్లు ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్‌, ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌కులు, మాజీ కార్పొరేట‌ర్‌ కొమిరిశెట్టి సాయిబాబ‌, మాదాపూర్ డివిజ‌న్ టిఆర్ఎస్ అద్య‌క్షులు ఎర్ర‌గుడ్ల శ్రీ‌నివాస్‌యాద‌వ్ లు పాల్గొని పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న ప్ర‌భుత్వ విప్ గాంధీ, కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్‌, కొమిరిశెట్టి ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌కులు సాయిబాబ‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here