నమస్తే శేరిలింగంపల్లి: జాతీయ వైద్య దినోత్సవంను పురస్కరించుకొని హఫీజ్‌పేట్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యసిబ్బందిని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ గురువారం ఘనంగా సన్మానించారు. ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డాక్టర్ వినయ్ బాబు, డాక్టర్ నాగమణి, వైద్య సిబ్బంది రాజశేఖర్, కవిత, పండరీ రెడ్డి, సంతోష్‌లను సత్కరించి వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ సందర్భంగా జ్ఞనేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ ఏడాది డాక్టర్ డే చాలా ప్రత్యేకమైనది అని అన్నారు. చరిత్రలో ఎన్నడూలేని విధంగా ప్రతికూల పరిస్థితుల్లో సైతం తమ ప్రాణాలను లెక్క చేయకుండా వైద్యులు, వైద్య సిబ్బంది మనకు సేవలు అందిస్తున్నారని అన్నారు. కనిపించని వైరస్‌తో పోరాడుతూ ప్రజలకు ప్రాణదానం చేస్తున్నారని అన్నారు. లాక్‌డౌన్ నుంచి అన్‌లాక్‌తో ప్రజలకు ఐతే ఉపశమనం లభించిందేమో, కానీ వైద్యులకు మాత్రం పని భారం పెరిగిపోయింది అని అన్నారు. రోజు రోజుకు వందల సంఖ్యలో నమోదవుతున్న కేసులను పరిష్కరించేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో వైద్యులను తప్పకుండా గౌరవించాలని, వారి సేవలను ఎన్నటికీ మరిచిపోకూడదని అన్నారు. మనం తగిన జాగ్రత్తలు పాటిస్తూ వైద్యులపై భారాన్ని తగ్గించాలని అన్నారు. ఒత్తిడిలో సైతం ప్రజల ప్రాణాలను అడ్డుపెట్టి రోగులను రక్షిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా వైద్యులందరికి జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు, సీనియర్ నాయకులు కోటేశ్వరరావు, శ్రీనివాస్ యాదవ్, లక్ష్మణ్, రాజా రత్నం తదితరులు పాల్గొన్నారు.