నమస్తే శేరిలింగంపల్లి : ఏపీ ముఖ్యమంత్రిగా జూన్ 12న పదవీప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు కి అన్నమాచార్య భావనా వాహిని వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ డా. శోభారాజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జుబ్లీహిల్స్ గృహంలోని తన నివాసంలో చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ చంద్రబాబు పరిపాలనాదక్షత, దార్శనికత, సంపదసృజనాసామర్థ్యం జగద్విదితములేనని, ఆయన సుస్థిర, సుదీర్ఘ సుపరిపాలనలో దేశం అన్ని విధాలా పురోగమిస్తుందని, న్యాయం, ధర్మం రక్షణ పొంది, ప్రతిభ రాణిస్తుందని విశ్వసిస్తున్నానని తెలిపారు. చంద్రబాబుకు ఆయురారోగ్యాలను భగవంతుడు ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.