- జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టాలని మిద్దెల మల్లారెడ్డి డిమాండ్
నమస్తే శేరిలింగంపల్లి : వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సెల్లార్ తవ్వకాల వల్ల ప్రమాదాలు సంభవిస్తాయని, తవ్వకాలు ఆపివేసేలా జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టాలని శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు మిద్దెల మల్లారెడ్డి డిమాండ్ చేశారు. చందానగర్ సర్కిల్ పరిధిలోని స్థానిక డివిజన్ లో అమీన్ పూర్ వెళ్లే ప్రధాన రహదారిలో కంకర్ ఉమెన్స్ బోన్టిక్యూ పక్కకు గత రెండు మూడు రోజుల నుండి జోరుగా లోతుగా సెల్లార్ గుంత తీస్తున్నారు. పక్కనే ఆనుకొని అయిదు అంతస్తుల భవనము ఉన్నదని, ఏదైనా జరిగితే వందలాదిమందికి ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
జీహెచ్ఎంసీ అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా వెంటనే ఈ సెల్లార్ గుంత తవ్వకాన్ని నిలిపివేసి గుంతను పూడ్చివేయించాలని కోరారు. గతేడాది నల్లగండ్లలో….అంతకుముందు సంవత్సరం చందానగర్ డివిజన్ దీప్తి శ్రీనగర్ పక్కకు హైవే కు ఆనుకొని ఉన్న ప్లాటు యజమాని సెల్లార్ గుంత తీయగా ఏర్పడిన ఇబ్బందులను వివరించారు. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జీహెచ్ఎంసీ అధికారులు, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా.. రెకమండేషన్లకు తలోగ్గా కుండా.. అవినీతికి పాల్పడకుండా వెంటనే సెల్లార్ గుంతలను నిలిపివేయాలని ప్రజల కోసం ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నామని మిద్దెల మల్లారెడ్డి తెలిపారు.