బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్షమే ప్రజల పాలిట శాపం : శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్

  • పసుపు నీళ్లు చల్లి బీఆర్ఎస్ నాయకుల ధర్నా శుద్ధి

గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నాయకులు చేసిన ధర్నాను శుద్ధి చేసే విధంగా పసుపు నీళ్లు చల్లి ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్, ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ విజయ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ , కాంగ్రెస్ పార్టీ జి.హెచ్.ఎమ్.సి ఫ్లోర్ లీడర్ రాజశేఖర రెడ్డి, ఉప్పల్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, రెహ్మత్ నగర్ కార్పొరేటర్ సి.ఎన్ రెడ్డి మహిళ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

బీఆర్ ఎస్ పార్టీ తీరుపై ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే విధంగా 2007లో తీసుకువచ్చిన జి.ఓ వల్ల గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 50 వేల అప్లికేషన్లు ఉన్నాయని, 2015లో నూతన తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు లక్ష యాభై వేల అప్లికేషన్లు ఉన్నాయని, 2020 లో 25లక్షల అప్లికేషన్లను వచ్చిన వాటిని పరిష్కరించకుండా పెండింగులో పెట్టి ఈరోజు ప్రజలను తప్పుదోవ పాటించేవిధంగా ధర్నాలు చేయడం దయ్యాలు నీతులు వల్లించినట్టు ఉందని అన్నారు.

బీఆర్ఎస్ నాయకులు చేసిన ధర్నాను పసుపునీళ్లు చల్లి శుద్ధి చేస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here