నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసే నిధుల కోసం శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని దేవాలయాల నిర్వాహకులు జూన్ 30వ తేదీ లోగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ బోనాల పర్వదినాన్ని శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వాడవాడలో బోనాల జాతర వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్న ట్లు తెలిపారు. ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తుకు కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు వెంట తీసుకురావాలని తెలిపారు.
- దరఖాస్తు కోసం కావాల్సిన పత్రాలు:
- గుడి పేరు మీద ఉన్న (1. లెటర్ హెడ్, 2. బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్, 3.ఆలయం ఫోటోలు)
- దేవాలయం చైర్మన్ లేదా కార్యదర్శి ఆధార్ కార్డ్ జిరాక్స్